ఆహార కల్తీపై మంత్రి సత్య కుమార్ కీలక వ్యాఖ్యలు 1 y ago
AP: శాసనసభలో ఆహార కల్తీపై జరిగిన చర్చపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ చట్టాల మేరకు రాష్ట్రంలో ఆహార కల్తీని నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు. ఆహార పదార్థాల్ని కల్తీ చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఆహార నమూనాలను సేకరించి సమీప ప్రయోగశాలలో పరిశీలిస్తున్నారని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని మంత్రి తెలిపారు.